Yuddham
సాహసం శ్వాసగా సాగిపో-2
ఒక్క ముక్కలో చెప్పాలంటే “యుద్ధం శరణం” పైన చెప్పిన (దాంట్లో కూడా నాగ చైతూ నే హిరో!) సినిమాకు దాదాపు సీక్వెల్ లాంటిదే. రెండూ దాదాపు ఒకటే పాయింట్ ఉన్న కథలే.కాక పొతే “సాహసం…” కు “యుద్ధం…” కు కొన్ని తేడాలున్నాయ్. అందులో ఒకటి శ్రీకాంత్ నెగటివె రోల్ లో చేయటం. ఇక చిత్రీకరణలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నట్లే. దాంట్లో హీరో మధ్య తరగతి..ఇందులో డబ్బున్నవాడూ(బాగా). ఇంకా ఈ సినిమాలో “డ్రోన్” వాడటం కొత్తగా ఉంది. మొదటి సినిమా కు రెండవ సినిమాకు మధ్య చైతూ కొంత యాక్టింగ్ నేర్చుకున్నట్లు అనిపించింది… కాని కొన్ని సన్నివేశాలు చూస్తే మళ్ళీ అదే డల్ బాడీ లాంగ్వేజ్ తో చాల చోట్ల మళ్ళి పాత చైతూ నే అనిపించాడు.
చైతూ ఈ సినిమా గురించి చెపుతూ,”ఇటువంటి స్క్రీన్ ప్లే ఇంతవరకు తెలుగు సినిం ఆల్లో చూసి ఉండరు”అన్నాడు. సినిమా ప్రారభం చూస్తే అలాగే అనిపిస్తుంది.. కాని తర్వాత మళ్ళీ మామూలే. కొన్ని సార్లు డైలాగులు బానే ఉన్నాయనిపిస్తుంది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం వివేక్ సాగర్ నేపథ్య సంగీతం. సినిమా అంతో ఇంతో థ్రిల్లింగా అనిపించటానికి ఇదొక కారాణం. “సాహసం.” కన్నా ఈ సినిమాలో ఫ్యామిలీ సీన్లు బావునాయి. దీనిక్కారణం రేవతి, రావు రమెష్(హీరో తల్లిదండ్రులు) ల నటన. ముఖ్యంగా రేవతి హావ భావలు ప్లెజంట్ గా ఉన్నాయి. రావు రమెష్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే.
ఈ సినిమాలో సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఉండే సన్నివేశాలు పెద్దగా లేవు. అది కొంచెం ఊరటనిచ్చే అంశం. హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. ఉన్న ఒకట్రెండు పాటల చిత్రీకరణ ఫర్వాలేదు. తెలుగు సినిమాల్లో లాజిక్ వెతక్కూడదు కనుక ఆ పని చేయటం లేదు. ఇంకా ఈ సినిమాలో ఒక మంచి విషయం ఉంది. మలి సగంలో ఎక్కడైనా సరే(తెలుగు సినిమ రూల్స్ ప్రకారం) ఐటం సాంగ్ పెట్టే అవకాశం ఉన్నా దర్శకుడెందుకో ఆ పని చేయలేదు. హీరోయిన్ ను కూడా పెద్దగా ఎక్స్ పోజ్ చెయ్యలేదు(ఎందుకో మరి!) ఇలాంటి సినిమాలో ఎత్తుకు పైఎత్తులు, బ్రైన్ గేంస్ థ్రిల్లింగ్ గా ఉండాలి. కొన్ని సార్లు మాత్రమే అల అనిపించింది. సాధరణంగా థ్రిల్లర్స్ లో కథనం లో బిగువుండాలి. అది కొంచెం లోపించటం ఒక మైనస్ పాయింటే. స్క్రీన్ ప్లే టైట్ గా లేకపోవటం వల్ల వచ్చిన సమస్య అది. దర్శకుడు కొత్తవాడు కావటం వల్ల కొంతవరకు ఇది అర్థం చేసుకోవచ్చు. కాని, సినిమా ను మాత్రం అతి ఎలివేట్ చెయ్యదని గమనించాలి.
ఇంతా చెప్పింతర్వాత ఒక్క విషయం చెప్పటం సమంజసంగా ఉంటుంది. ఈ సినిమా ఈ మధ్య కాలం లో వచ్చిన చాలా తెలుగు సినిమాల కంటే బెటర్. నిజాయితీ గా చెప్పాలంటే ఇది తప్పక చూడవాల్సిన సినిమాల జాబితాలో లేకపోయినా కొంతవరకు బావున్న స్క్రీన్ ప్లే, నేపథ్య సంగీతం, హీరొయిన్ ను ఎక్స్ పోజ్ చెయ్యకపోవటం, ఐటం సాంగ్ లేక పోవటం, ఆహ్లాదకరమైన కుటుంబ సన్నివేశాల చిత్రీకరణ, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు, పుంజీడు డైలాగులు వంటి అంశాల వల్ల ఈ సినిమా చూడొచ్చు. “సాహసం శ్వాసగా..” చూడని వారు దీన్ని చూసేయొచ్చు!